MLA Revanth Reddy resignation issue ఆ సస్పెన్స్ కూడా బద్దలు కొట్టిన రేవంత్ | Oneindia Telugu

2017-10-28 62

Speculations are widely spreading over Revanth Reddy resignation issue
గత వారం, పదిహేను రోజులుగా టీటీడీపీలో సాగుతున్న నాటకీయ పరిణామాలకు ఎట్టకేలకు తెరపడింది. పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడం ద్వారా రేవంత్ టీడీపతో తెగదెంపులు చేసుకోగా.. ఆయన తదుపరి అడుగులు చర్చనీయాంశంగా మారాయి.
టీడీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో.. కాంగ్రెస్ లో చేరడానికి ఆయన పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తారా? లేక ఒకప్పుడు తాను విమర్శించిన నేతలకు ఇప్పుడు తనను విమర్శించే ఛాన్స్ ఇస్తారా? అన్న చర్చ జరుగుతున్న సందర్భంలో.. రేవంత్ రెడ్డి రాజీనామాకే సిద్దపడ్డారు.
అమరావతిలో భేటీ తర్వాత రేవంత్ నేరుగా తన నియోజకవర్గం కొండగల్ వెళ్లే అవకాశముంది. అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలతో రాజీనామా అంశం గురించి ఆయన చర్చించనున్నారు. అయితే అక్కడికి వెళ్లడం కన్నా ముందే ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించడం గమనార్హం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా నేపథ్యంలో.. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ప్రధానంగా ఆయన కొడంగల్ ప్రజలతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఉపఎన్నిక తప్పదు కాబట్టి ప్రజలు ఎలా స్పందిస్తారన్న దానిపై ఆయన దృష్టి పెట్టనున్నారు.

Videos similaires